నామినేటెడ్ పోస్టుల భర్తీ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

- October 25, 2024 , by Maagulf
నామినేటెడ్ పోస్టుల భర్తీ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

అమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉండవల్లి నివాసంలో సమావేశమైన సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలతో దాదాపు మూడు గంటల పాటు చర్చించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా రెండో లిస్ట్ ప్రకటించాలని పార్టీ నేతలకు తెలిపారు. ఇక రెండో విడతగా 40మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఇందు కోసం చంద్రబాబు కూటమి నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన నివాసంలో దాదాపు 3 గంటల పాటు పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టులు, రేపటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల రెండో దశ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను చంద్రబాబు ఇచ్చారు. అదే విధంగా రెండో దఫా కూడా దాదాపు 40కి పైగా కార్పొరేషన్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్న ఫీడ్ బ్యాక్ తీసుకుని చెక్ చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు కష్టపడిన కార్యకర్తలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడపోత పూర్తైందని తెలుస్తోంది. వివిధ మార్గాల ద్వారా.. సర్వే టీమ్స్, బ్యాక్ ఆఫీస్ ద్వారా వచ్చిన పేర్లను చంద్రబాబు దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. దాదాపుగా లిస్ట్ ఫైనల్ అయిందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com