ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం రోడ్‌ మూసివేత: ROP

- October 25, 2024 , by Maagulf
ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం రోడ్‌ మూసివేత: ROP

మస్కట్: దోఫర్‌లో ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరుగుతున్న సందర్భంగా రహదారులను మూసివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) శనివారం, అక్టోబర్ 26, 2024 నాడు సలాలా-తఖా-మిర్బత్ రహదారిపై పాక్షికంగా ట్రాఫిక్ నిలిపివేసినట్లు వెల్లడించింది.ఈ నిర్ణయం కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ROP సూచించింది.

ఈ రహదారి మూసివేత కారణంగా ప్రజలు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని, ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు సహకరించాలని ROP విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారం ప్రజలకు అందించడానికి రాయల్ ఒమన్ పోలీసులు వివిధ మీడియా వేదికలను నివేదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com