పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత

- October 25, 2024 , by Maagulf
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత

తెలంగాణ: తెలంగాణ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన కనకరాజు కన్నుమూశాడు. ఆదిలాబాద్‌ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనను 2021లో పద్మశ్రీతో సత్కరించింది. రేపు మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆసీఫాబాద్‌లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరుచూ ప్రదర్శిస్తూ.. భావితరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దీంతో ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీ కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. 2021 నవంబర్‌ 9న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com