ఇరాన్‌ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!

- October 27, 2024 , by Maagulf
ఇరాన్‌ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!

యూఏఈ: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని యూఏఈ ఖండించింది. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) ఒక ప్రకటనలో కోరింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.  

ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్‌లలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని ఇరాన్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com