హైదరాబాద్: జన్వాడ ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ

- October 27, 2024 , by Maagulf
హైదరాబాద్: జన్వాడ ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ

హైదరాబాద్: జన్వాడలోని రాజీ పాకల కు చెందిన ఫామ్‌ హౌస్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు..

అలాగే, ఫారిన్‌ లిక్కర్‌, డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే, రేవ్‌ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను ఫామ్‌ హౌస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ ల తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో వీఐపీల రేవ్‌ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్‌తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు.

దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్‌ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com