బిగ్ ఎంటర్‌ట‌ైనర్: అవినాష్ అప్పుడలా.. ఇప్పుడిలా.!

- October 28, 2024 , by Maagulf
బిగ్ ఎంటర్‌ట‌ైనర్: అవినాష్ అప్పుడలా.. ఇప్పుడిలా.!

జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పాపులర్ అయిన అవినాష్.. ఏ షోలో కనిపించినా హండ్రెడ్ పర్సంట్ ఎంటర్‌ట‌ైన్‌మెంట్ అది మాత్రం పక్కా.

మరి, ఎంటర్‌టైన్మెంట్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన బిగ్‌బాస్ షోలో అవినాష్ వుంటే..! గతంలో ఓ సీజన్‌లో డైరెక్ట్‌గానే అవినాష్ హౌస్‌లో ఎంటర్‌టైన్ చేశాడు.

ఆ సీజన్‌ నాటికి అవినాష్‌కి పెళ్లి కాలేదు. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటూ ఆ సీజన్‌లో తానున్నంత కాలం నవ్వులు పూయిస్తూనే వున్నాడు అవినాష్.

తాజా సీజన్‌లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అవినాష్‌కి పెళ్లయ్యింది.

ఇప్పుడిదే టాపిక్ పదే పదే ఎత్తుతూ.. ‘నాకు పెళ్లయిపోయింది.. ఐ లవ్ యూ అనూ..’ అంటూ తన భార్య పేరునూ ఆమెపై తన ప్రేమను పదే పదే చాటుకుంటూ నవ్విస్తున్నాడు.

అవినాష్ ఏం చేసినా ఎంటర్‌టైన్‌మెంటే కదా.. ఆడియన్స్ దాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నారు. బిగ్‌బాస్‌ లవర్స్ ఇష్టపడే ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే అలా వుండాలి మరి. ఆ విషయంలో అవినాష్ వందకు వంద మార్కులు వేయించుకుంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com