‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ అంచనాలు భళా.! కానీ.!
- October 28, 2024
అనుకోకుండా ‘పుష్ప’ అంచనాలకు మించి సంచలనాలు అందుకోవడం వల్ల రెండో పార్ట్ ‘పుష్ప ది రైజింగ్’ విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.
అంచనాలను అందుకునేలా.. భారీ స్కేల్‌తో రూపొందిస్తున్నారు ఈ సినిమాని. డిశంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లు జోరందుకుంటున్నాయ్. అందులో భాగంగానే రోజుకో క్రేజీ న్యూస్ ఈ సినిమా నుంచి బయటికొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే తాజాగా బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ఏకంగా 11, 500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారట.. అనే ప్రచారం తెర పైకి వచ్చింది.
అలాగే ప్రమోషన్లలో మరిన్ని ఇన్నోవేటివ్ థాట్స్ చేస్తున్నారనీ తెలుస్తోంది. రిలీజ్‌కి ముందే బజ్ ఓ రేంజ్‌లో వచ్చేలా చూస్తున్నారట. తద్వారా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
ఇదంతా సరే, ప్రీ రిలీజ్ బజ్ ఎలా వున్నా.. సినిమాలో విషయం వుంటేనే కదా.. సినిమా హిట్ అయ్యేది. అసలే అల్లు అర్జున్‌కి అన్ని వైపులా నెగిటివిటీ వైఫైలా ఆవహించి వుంది. ఈ పరిస్థితిని తట్టుకుని ‘పుష్ప 2’ ఎలా గట్టెక్కుతుందో.. రికార్డులెలా కొల్లగొడుతుందో చూడాలిక.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







