మీనాక్షి ‘లక్కీ’ లేడీ అవుతుందా.?
- October 28, 2024
మీనాక్షి చౌదరి.. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా వరుసగా పెద్ద పెద్ద అవకాశాలు దక్కించుకుంటోంది.
ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్ అంటే టాలీవుడ్లో మొదటగా మీనాక్షి పేరునే చెప్పాలేమో. అంతలా వరుస సినిమాలతో బిజీగా వుంది మీనాక్షి చౌదరి.
ఈ దీపావళికి ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. హీరోగా ‘సీతారామం’ వంటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో దుల్కర్.
అలా చూస్తే ఇదో క్రేజీ ప్రాజెక్ట్ మీనాక్షికి. టైటిల్లో వున్నట్లుగా లక్కు మీనాక్షికి కలిసొస్తే.. ముందు ముందు ఫ్యూచర్ ఆమెదే.
ఎందుకంటే.. నెక్స్ట్ మంత్ ‘మట్కా’ సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వస్తోంది. అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో ‘మెకానిక్ రాఖీ’తోనూ వచ్చే నెలలోనే మీనాక్షి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే, భిగ్గెస్ట్ ప్రాజెక్టులు మీనాక్షి కోసం క్యూ కడుతున్నాయ్. లక్కు చెక్ ఎలా వుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







