కిరణ్ అబ్బవరం ‘క’తో ఏదో మ్యాజిక్ చేసేలానే వున్నాడు.!
- October 28, 2024
‘క’ అనే కొత్త టైటిల్లో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సారిక, రిధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ప్రత్యేకంగా రూపొందిన సినిమా ఇది.
ట్రైలర్‌తో పాటూ విడుదలైన ప్రచార చిత్రాలన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ దీపావళి రేస్‌లో రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాల్లో ‘క’పైనా అంచనాలు బాగానే వున్నాయ్.
అంతేకాదు, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్‌కి సరికొత్త ఫీలింగ్ ఇవ్వకపోతే ఇకపై సినిమాలు మానేస్తా.. అని తన సన్నిహితులతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడట కిరణ్ అబ్బవరం. అంటే, ఈ సినిమా రిజల్ట్‌పై మనోడికి చాలా అంచనాలున్నాయన్నమాట.
మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలున్నాయ్ ప్రమోషన్స్ బజ్‌ని బట్టి. ప్రచార చిత్రాల్లో చూపించినట్లుగా కంటెంట్ ఇంట్రెస్టింగ్గా వుంటే మాత్రం సినిమా పక్కా హిట్ అయ్యే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







