ఆ బయోపిక్‌లో సాయి పల్లవి.!

- October 28, 2024 , by Maagulf
ఆ బయోపిక్‌లో సాయి పల్లవి.!

సాయి పల్లవి చేసిన సినిమాలు తక్కువే అయినా ఎనలేని క్రేజ్ దక్కించుకుంది. లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు.

కానీ, ఇఫ్పుడు సాయి పల్లవి చేసే సినిమాలు ఆమె క్రేజ్‌ని అదే స్థాయిలో నిలబెడతాయా.? అంటే ఏమో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలున్నాయ్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో.

బాలీవుడ్‌లో ‘రామాయణం’ సినిమాలో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మొదటి నుంచీ వివాదాల్ని ఎదుర్కొంటూ వస్తోంది. తెలుగులో ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఇక, తమిళంలో సాయి పల్లవి నటించిన ‘అమరన్’ సినిమా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మేజర్ ముకుంద్ వరద రాజన్ బయోపిక్‌గా యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. శివ కార్తికేయన్ లీడ్ రోల్ పోషిస్తుండగా, ముకుందన్ భార్య పాత్రలో ఓ మూడేళ్ల పాపకి తల్లిగా సాయి పల్లవి నటిస్తోంది ఈ సినిమాలో.

అసలే సహజ నటి. ఈ సినిమా కోసం మరింత సహజంగా నటించి మెప్పించింది సాయి పల్లవి. లాంగ్ గ్యాప్ తర్వాత అమరన్ సినిమాతో వస్తున్న సాయి పల్లవి కెరీర్‌కి ఈ సినిమా ఎంత మేర కలిసొస్తుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com