సౌదీ-ఎమిరాటీ ఎకనామిక్ ఫోరమ్.. SR111 బిలియన్లకు పెరిగిన ఎమిరాటీ పెట్టుబడులు..!!

- October 29, 2024 , by Maagulf
సౌదీ-ఎమిరాటీ ఎకనామిక్ ఫోరమ్.. SR111 బిలియన్లకు పెరిగిన ఎమిరాటీ పెట్టుబడులు..!!

రియాద్: సౌదీ-ఎమిరాటీ ఎకనామిక్ ఫోరమ్ మూడవ ఎడిషన్‌ను సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ రియాద్‌లో నిర్వహించింది. ఇందులో ఆర్థిక మంత్రి ఫైసల్ అల్-ఇబ్రహీం, పరిశ్రమల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో ప్రత్యక్ష ఎమిరాటీ పెట్టుబడుల పరిమాణం SR111 బిలియన్లు అని అల్-ఇబ్రహీం నివేదించారు. తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి 25% పెరిగి SR113 బిలియన్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో యూఏఈకి సౌదీ ఎగుమతులు 2018 నుండి 2023 వరకు 9% కంటే ఎక్కువ వార్షిక రేటుతో వృద్ధి చెందాయని, 2024లో మొత్తం SR31 బిలియన్లకు చేరుకుందని పరిశ్రమల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక, మైనింగ్ రంగాలలో ఇంకా పెట్టుబడులు పెరగాలని ఆకాంక్షించారు. అంతకుముందు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా అల్ మర్రి నేతృత్వంలోని 100కి పైగా ప్రధాన కంపెనీల ఎమిరాటీ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని ఫోరమ్ స్వాగతించింది,.వీరితో పాటు ఇరు దేశాల నుండి అనేక మంది అధికారులు, పెట్టుబడిదారులు ఉన్నారు. మొదటి ఫోరమ్ 2018లో అబుదాబిలో జరిగింది. రెండోది 2019లో రియాద్‌లో జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com