జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లో భారీ స్మగ్లింగ్..అడ్డుకున్న కస్టమ్ అధికారులు..!!
- October 29, 2024
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ వద్ద భారీ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. 2,414,489 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. రాజ్యానికి వచ్చిన సరుకులో డ్రగ్స్ దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. ZATCA జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో కలిసి తనిఖీలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. @zatca.gov.sa అనే ఇమెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ +966114208417 ద్వారా లేదా సెక్యూరిటీ నంబర్ 1910 ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని కోరారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి బహుమతి అందజేస్తామని, వారి వివరాలు గోప్యంగా పెడతామని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల