దుబాయ్ లో కొత్త రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు..!!
- October 29, 2024
దుబాయ్: అమెరికా ఎన్నికల అనిశ్చితి కారణంగా గ్లోబల్ ధరలు పెరగడంతో మంగళవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం 24K వేరియంట్ ఉదయం గ్రాముకు Dh333.5ను తాకింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి Dh331.75 గా ఉంది. ఇతర వేరియంట్లలో 22K, 21K , 18Kలు గ్రాముకు వరుసగా Dh308.75, Dh299.0, Dh256.25 వద్ద ప్రారంభమయ్యాయి.
భారతీయ పండుగలైన దీపావళి, ధంతేరస్ సమయంలో చాలా మంది దుకాణదారులు బంగారం, విలువైన లోహపు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రికార్డు-అధిక ధరల మధ్య దుకాణదారులు 18K నిర్మిత ఆభరణాల వేరియంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారపొ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు రానియా గులే తెలిపారు. బంగారం $2,750, $2,720 మధ్య గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుందని, $2,748 నుండి $2,750కి దిగువన ఉన్న సమయంలో మద్దతు లభించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







