సంక్రాంతి రేస్ నుంచి ‘తండేల్’ తప్పుకున్నట్లేనా.?

- October 29, 2024 , by Maagulf
సంక్రాంతి రేస్ నుంచి ‘తండేల్’ తప్పుకున్నట్లేనా.?

నాగ చైతన్య తాజా సినిమా ‘తండేల్’కి ఇంకా రిలీజ్ టైమ్ రాలేనట్లుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా డిశంబర్‌కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ, ఆ డేట్ కూడా ఇప్పుడు కన్‌ఫామ్ కాదనీ, సంక్రాంతికి ‘తండేల్’ రావచ్చని అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ డేట్ కూడా డైలమాలో పడింది.

సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ రూపంలో మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్లాట్ ఆక్యుపై చేసేశారు. దాంతో, ఈ టైమ్‌లో మరో ఓ మోస్తరు అంచనాలున్న సినిమాలు రిస్క్ చేయడం లేదు.

చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఓకే కానీ, ‘తండేల్’ వంటి సినిమాలు మాత్రం వెనక్కి తగ్గేలానే వున్నాయ్.

ఇక తాజాగా ఓ సినిమా ఫంక్షన్‌లో ‘తండేల్’ రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ చందూ మొండేటి స్యయంగా ఓపెన్ అయిపోయారు.

డిశంబర్‌కి సినిమా అయితే పూర్తి కాదు, సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ దిల్ రాజు సినిమా కావడంతో ధియేటర్ల ఇబ్బంది వుండనే వుంటుంది. సో, సంక్రాంతికి కూడా రాలేమన్నట్లే ఆయన కన్‌ఫామ్ చేసేశారు. సో, ‘తండేల్’ మరో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com