మేనల్లుడి కోసం అతిధి పాత్రలో సూపర్ స్టార్.?
- October 29, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రమిది.
ఎప్పటిలాగే, ప్రశాంత్ వర్మ ఈ సినిమాలోనూ తనదైన టెక్నికల్ టీమ్‌కి బాగా పని పెట్టారని తెలుస్తోంది.
అంతేకాదు, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ పోషిస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
అది కూడా కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘కల్కి’ సినిమాలోనే తరువాతి పార్ట్‌లో కృష్ణుడి పాత్ర పోషించబోయేది మహేష్ బాబునే అనే ప్రచారం జరిగింది.
అయితే, అంతకన్నా ముందే మేనల్లుడి కోసం మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు వున్న మేకోవర్ కృష్ణుడి పాత్రకు సెట్ అయ్యేలానే వుంటుంది. క్యామియో రోలే కాబట్టి.. మహేష్ ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు ఏ స్థాయిలో మార్మోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, ప్రశాంత్ వర్మ చొరవ తీసుకుంటే, మహేష్‌తో ఆ పాత్ర చేయించడం పెద్ద కష్టమేమీ కాదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల