ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు పై చర్చ!
- October 29, 2024
అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. కపిల్ దేవ్ కి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుపై పలు అంశాలు చర్చలు జరిపారు.
కపిల్ దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్రికెట్, గోల్ఫ్ గేమ్స్ కు సంబంధించిన పలు అంశాలతో పాటు వాటి అభివృద్ధికి సంబంధించిన సూచనలపై చర్చించారు. వాటిపై సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించాలని అన్నారు.
విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన గోల్ఫ్ ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రాచుర్యం సంపాదించుకుంటుందని…. క్రికెట్ తర్వాత అంత ఖరీదైన క్రీడ గోల్ఫ్ అని పేర్కొన్నారు. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ త్వరలో ఐపీఎల్ తరహాలోనే… గోల్ఫ్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. గోల్ఫ్ ప్రీమియర్ లీగ్‌లో ఏపీ నుంచి ఒక జట్టు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







