గోల్ఫ్ ఆడుతున్న జగన్
- June 23, 2016
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిత్యం ఓదార్పు యాత్రలు, నిరాహార దీక్షలు, ప్రజా సమస్యల పైన ఉద్యమాలతో బీజీగా ఉండే జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన తన కుటుంబంతో సహా ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనలో భాగంగా జగన్ కుటుంబం బుధవారం నాడు ఈడెన్ బర్గ్ చేరుకుంది. జగన్ ఆటవిడుపుగా గోల్ఫ్ ఆడారు. పది రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఏడు రోజుల పాటు యూకేలో, మూడు రోజులు ఐర్లాండ్, స్కాట్లాండ్లో గడుపుతున్నారు.
జగన్ పది రోజుల పర్యటనలో భాగంగా జూన్ 16వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులతో బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లారు. జగన్ తన సతీమణి భారతి, ఇద్దరు పిల్లలతో కలిసి పర్యటనకు వెళ్లారు. చాలా రోజుల తర్వాత జగన్ పూర్తిస్థాయిలో కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







