రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

- October 30, 2024 , by Maagulf
రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుమల: తిరుమల వెళ్లే వీఐపీలకు టీటీడీ కీలక సూచన చేసింది.రేపు దీపావళి పండుగ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయనున్నారు. దీంతో, నేడు ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com