ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!

- October 30, 2024 , by Maagulf
ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!

దోహా: సముద్ర పర్యాటక కార్యాలయాలు, సముద్ర రవాణా నౌకల లైసెన్సింగ్‌లతో సహా సముద్ర పర్యాటక రవాణాను నియంత్రించే నిబంధనలకు సంబంధించిన అప్ డేట్ లను ఖతార్ టూరిజం ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా, ఖతార్ టూరిజం సముద్ర పర్యాటక రవాణా వాహనాల యజమానులు,  ఆపరేటర్ల కోసం కొత్త వర్గీకరణ గైడ్‌ను విడుదల చేసింది.  ఈ నౌకలను నిర్వహించడానికి అవసరమైన స్పెసిఫికేషన్‌లను వివరించింది. ఈ అప్‌డేట్‌లు 2018 టూరిజం రెగ్యులేషన్ లా నంబర్ (20)కి అనుగుణంగా ఉన్నాయని తెలిపింది.

2024 వర్గీకరణ గైడ్ వెర్షన్ 1.1లో వివరించిన వర్గీకరణ ప్రమాణాలుకు అనుగుణంగా లేని కేటగిరీ (A) నౌకలు దోహా కార్నిచ్ ప్రాంతంలో ఆపరేట్ చేయడానికి అనుమతించరు.  అలాగే కేటగిరీ (A) - చిన్న ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించాలి. కేటగిరీ (B) - దీర్ఘ ప్రయాణాలకు ఉపయోగించాలి. కార్నిచ్ ప్రాంతం దాటేందుకు అనుమతి ఉంటుంది. కేటగిరీ (C) – వసతి,  భోజనం (ప్రీమియం మరియు విలాసవంతమైన పడవలు వంటి పడవలు) అందించే దూర ప్రయాణాలకు ఉపయోగించవచ్చు. 

అయితే, వ్యక్తులు కేటగిరీ (A) కింద ఉన్న పడవలను మాత్రమే ఆపరేట్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కేటగిరీలు (B), (C) రెండూ లైసెన్స్ పొందిన పర్యాటక సంస్థల ద్వారా  నిర్వహించాలని ఖతార్ టూరిజంలో టూరిజం లైసెన్సింగ్ డైరెక్టర్ ఫహద్ హసన్ అల్ అబ్దెల్మలేక్ తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com