యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

- November 01, 2024 , by Maagulf
యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

యూఏఈః యూఏఈలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈమేరకు ఇంధన ధరల కమిటీ నవంబర్ నెలకు సంబంధించిన ఇంధన ధరలను ప్రకటించింది. కొత్త రేట్లు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి.
-అక్టోబర్లో 2.66 దిర్హాలతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 2.74 అవుతుంది.
-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.63( ప్రస్తుత ధర Dh2.54).
-E-Plus 91 పెట్రోల్ ధర Dh2.55(అక్టోబరులో Dh2.47).
-ప్రస్తుతం ఉన్న 2.6 దిర్హాంతో పోలిస్తే డీజిల్ లీటరుకు 2.67 దిర్హామ్లు అయింది.  
 2015లో యూఏఈ పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. గ్లోబల్ రేట్ల ఆధారంగా ఇంధన ధరల కమిటీ ప్రతి నెలాఖరున రేట్లను నిర్ణయిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com