అజ్మాన్ లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు..!!

- November 02, 2024 , by Maagulf
అజ్మాన్ లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు..!!

అజ్మాన్: నవంబర్ 4 నుండి డిసెంబర్ 15 వరకు ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 31కి ముందు అజ్మాన్‌లో జరిగిన ఉల్లంఘనలపై విధించే అన్ని జరిమానాలకు తగ్గింపు వర్తిస్తుంది. ఇది తీవ్రమైన ఉల్లంఘనలను కవర్ చేయదని అథారిటీ తెలిపింది. తేలికపాటి లేదా భారీ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఓవర్‌టేకింగ్ నిషేధించబడిన ప్రదేశంలో ట్రక్కు డ్రైవర్లు ఓవర్‌టేక్ చేయడం, గరిష్ట వేగ పరిమితిని 80kmph కంటే ఎక్కువ దాటడం, ముందస్తు అనుమతి లేకుండా వాహనంలో మార్పులు చేయడం వంటివి తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com