కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు..పురోగతిని సమీక్షించిన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్..!!

- November 02, 2024 , by Maagulf
కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు..పురోగతిని సమీక్షించిన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్..!!

కువైట్: కొత్త విమానాశ్రయ ప్రాజెక్ట్‌లో తాజా పరిణామాలను పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా మహ్మద్ అల్-మిషాన్ సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ఆమోదించబడిన నాణ్యత  ప్రమాణాలతో అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌ను ప్రభావితం చేసే ఏవైనా పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ T2 అనేది "న్యూ కువైట్ 2035" విజన్‌కు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి,  పెట్టుబడులను ఆకర్షించే ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక  వాణిజ్య కేంద్రంగా దేశాన్ని మార్చడానికి ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టులలో ఒకటని గుర్తు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com