ఖతార్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 07, 2015
ఈరోజు నుండి దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, బలమైన ఇసుక తుఫాను గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వారు తెలియజేశారు . అత్యధికంగా 45 డెగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండవచ్చని, రువాఇస్, దుఖాన్ మరియు అబూ సమ్రాలలో కాస్త తక్కువ ఉస్నోగ్రతలు నమోదవచ్చని తెలిసింది. నిన్నటి మాదిరిగానే దోహా, అల్ ఖోర్, వక్రాహ్ మరియు మెశాయీద్ లలో వేడి వాతావరణం నెలకొనవచ్చు. అబూ సమ్రా మరియు దుఖాన్ లలో 36 నుండి 38 డెగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వాతావరణ శాఖవారి నివేదిక ప్రకారం, వాయువ్య దిశలోని తీవ్రగాలులు దేశమంతా విజృంభిస్తాయని, కానీ రాత్రిపూట మాత్రం కొంత తగ్గే అవకాశముందని వారుచెప్పారు. తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో కూడా గాలుల నెదుర్కొంటాయని చెప్పారు. ఈ ఇసుక తుఫానుల వలన సుమారు రెండు కిలోమీటర్ల వరకు దృష్టి గోచరత తగ్గిపోతుందని, తీర ప్రాంతాలలో నీటి మట్టం 10 అడుగుల వరకు పెరుగుతుందని, సాయంత్రం మూడు నుండి ఐదు అడుగుల వరకు తగ్గుతుందని తెలియవచ్చింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









