డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!

- November 04, 2024 , by Maagulf
డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!

రియాద్: సౌదీ అరేబియాతోపాటు ఏడు ఇతర ఒపెక్ + దేశాలు డిసెంబరు 2024 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) అదనపు చమురు స్వచ్ఛంద కోతలను మరో నెల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఒపెక్  దేశాలు నవంబర్ 2023లో ప్రకటించిన స్వచ్ఛంద చమురు కొతకు 2.2 మిలియన్ బిపిడి పొడిగించడానికి అంగీకరించాయని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏప్రిల్ 2024న జరిగిన దాని 53వ సమావేశంలో జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి సర్దుబాట్‌లను కొనసాగించాలని నిర్ణయించింది.  ఆగస్టులో సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ, కువైట్, అల్జీరియా, ఒమన్, ఇరాక్, కజకిస్తాన్‌ లు రెండు దఫాలుగా చర్చలు జరిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com