నవంబర్ 15 నుండి కువైట్ స్ప్రింగ్ క్యాంప్స్.. ఉల్లంఘనలకు KD5,000 జరిమానా..!!
- November 05, 2024
కువైట్: మునిసిపల్ కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీ సీజనల్ స్ప్రింగ్ క్యాంపుల బైలా ఏర్పాటును ఖరారు చేసింది. స్ప్రింగ్ క్యాంపులు ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుండి మార్చి 15 వరకు ప్రారంభమవుతాయి. సరైన అనుమతులు లేకుండా క్యాంపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన లేదా శీతాకాలపు శిబిరాలను ఏర్పాటు చేసిన వారికి 3,000 నుండి 5,000 దీనార్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. మునిసిపల్ కమిటీ క్యాంపింగ్ నియమాలను వెల్లడించింది. చిన్న, మధ్యస్థ వ్యాపారాలు, అలాగే రెస్టారెంట్ కేఫ్ రంగాలలోని కంపెనీలు కూడా క్యాంపింగ్ ప్రాంతంలో నిర్దిష్ట ప్రదేశాలలో ఏర్పాటుకు అనుమతిస్తారు. స్ప్రింగ్ క్యాంప్స్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాలలో కూడా తాత్కాలిక ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చు. క్యాంప్ నిబంధనల ప్రకారం..వాణిజ్య మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన కాఫీ దుకాణాలు, జ్యూస్‌లు, రిఫ్రెష్‌మెంట్‌లు, స్నాక్స్ స్టాల్స్ స్ప్రింగ్‌కు అనుగుణంగా కువైట్ మునిసిపాలిటీ పేర్కొన్న ప్రదేశాలలో కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి అనుమతించనున్నారు. మరింత సమాచారం కోసం మునిసిపల్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







