డయాస్పోరా పిల్లల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్
- November 06, 2024
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ 2024-2025 విద్యా సంవత్సరానికి డయాస్పోరా పిల్లల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (SPDC) కు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏదేని భారత విశ్వవిద్యాలయం నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న (మొదటి సంవత్సరంలో చేరిన) 17-21 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు అప్లై చేయడానికి అర్హులు.
డయాస్పోరా పిల్లలు అంటే, తమ తల్లిదండ్రులు వలస వెళ్ళిన దేశంలో పుట్టి పెరిగిన పిల్లలు. వీరు రెండు సంస్కృతుల మేళవింపులో పెరుగుతారు. ఉదాహరణకు, అమెరికాలో పుట్టిన భారతీయ పిల్లలు, భారతీయ సంప్రదాయాలు, పండుగలు పాటిస్తూ, అక్కడి జీవనశైలిని కూడా అనుసరిస్తారు. వీరు తమ మూలాలను గుర్తుంచుకుంటూ, కొత్త దేశంలో సాంస్కృతిక అనుసంధానాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా డయాస్పోరా పిల్లలు రెండు దేశాల మధ్య వారధిగా ఉంటారు.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల పిల్లలు Persons of Indian Origin (PIO), ప్రవాస భారతీయులు Non-Resident Indians (NRI), మరియు immigration checking required (ECR) దేశాలలో నివసిస్తున్న భారతీయ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు అప్లై చేసే అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు మెరిట్-కమ్-మీన్స్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో 2024 నుండి వైద్య విద్య కోర్సులు కూడా చేర్చబడ్డాయి.ప్రతి సంవత్సరం USD 4000 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. (2వ నుండి 5వ సంవత్సరానికి స్కాలర్షిప్ ఉంటుంది.)
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కొరకు దరఖాస్తు చేయడానికి మీ పరిధిలోని భారత రాయబార కార్యాలయం/కౌన్సులేట్‌ను సంప్రదించండి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30 నవంబర్ 2024.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా, భారతీయ మూలాల పిల్లలు మరియు ప్రవాస భారతీయులు భారతదేశంలో ఉన్నత విద్యను పొందడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి భారత రాయబార కార్యాలయం లేదా కౌన్సులేట్‌ను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!