సౌదీలో మరోమూడు రోజులపాటు భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- November 06, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో నవంబర్ 9వతేదీ (శనివారం) వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని పౌర రక్షణ శాఖ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. వరదలు వచ్చే అవకాశం ఉన్న లోయ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
మక్కా ప్రాంతంలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని, దీని కారణంగా ఆకస్మిక వరదలు, తీవ్రమైన గాలులకు దారితీయవచ్చని తెలిపింది. హేల్, తబుక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు, అసిర్, జజాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..తూర్పు ప్రావిన్స్, అల్-బహా, మదీనా, ఖాసిం, నజ్రాన్ ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







