ఈ సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యిని తినకూడదు
- November 08, 2024
నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం పరగడపున నెయ్యి తీసుకోవడం జీర్ణవ్యవస్థ పనితీరు మెరగవుతుంది. గట్ ఆరోగ్యాన్ని నెయ్యి మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లక్షణాలు తగ్గించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నెయ్యిలో ఉంటే ఫ్యాట్స్ మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. పిల్లల జ్ఞాపక శక్తి పెంపొందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఎముకలు ధృఢంగా మారుతాయి.
నెయ్యిని మనలో చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేడి వేడి అన్నం, పచ్చడి కలుపుకుని కాస్తా నెయ్యి వేసి తింటే స్వర్గమే. అంతేకాకుండా వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి నెయ్యి వాడుతుంటారు. అంతేకాకుండా నెయ్యితో చేసిన స్వీట్స్ మంచి టేస్ట్ ఇస్తాయి. ఇక, చిన్న పిల్లలకు నెయ్యిని తినిపిస్తుంటారు పెద్దలు. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,డి, ఇ,కె, ఒమేగా -3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి నెయ్యి ఎంతో మేలు చేసినప్పటికీ.. ఇది కొందరికి పడదు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు దేశంలో అధిక కొలెస్ట్రాల్ అతి పెద్ద సమస్యగా మారింది. అధిక కొలెస్ట్రాల్‌ని డైస్లిపిడెమియా అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కొవ్వు. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి (టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్), విటమిన్ డి ఏర్పడటానికి కొవ్వు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ప్రధానంగా ఆహారం నుంచి ఉత్పత్తి అవుతుంది. అందుకే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులు హై కొలెస్ట్రాల్ లెవల్ పెంచే ప్రమాదముంది.
రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి మితంగా వాడాలి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. నెయ్యిలో ఉంటే కొవ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది. ఒకవేళ నెయ్యి తీసుకోవాలనుకుంటే డాక్టర్‌ని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
కొందరికి అజీర్తి, వికారం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడతారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోకూడదు. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి కాస్తా సమయం పడుతుంది. ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదముంది. అందుకే ఇలాంటి వారు నెయ్యి జోలికి పోకూడదు.
కొందరికి మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంటుంది. పాలకు సంబంధిత పదార్థాలు తీసుకుంటే వీరికి రియాక్షన్ ఉంటుంది. చర్మంపై మంట, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు ఎదుర్కోంటారు. అందుకే నెయ్యి వీరికి పడకపోవచ్చు. నెయ్యిలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల వీరికి అలర్జీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
లివర్ వ్యాధితో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. కాలేయ వ్యాధి ఉన్నవారికి వ్యాధుల్ని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి వారు నెయ్యి తీసుకోవడం జీర్ణించుకోవడం కష్టమవుతుంది. లివర్ సిరోసిస్, హెపటో మొగలీ, హెపటైటిస్ రోగులు నెయ్యిని పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







