అహ్మదీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాప్రాయం..!!

- November 08, 2024 , by Maagulf
అహ్మదీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాప్రాయం..!!

కువైట్: పాత అహ్మదీ హాస్పిటల్‌లో  అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రోగులు, వైద్య సిబ్బందికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. పాత ఆసుపత్రి నుండి రోగులు, సిబ్బందిని ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని ఆయన తెలిపారు.  ఈ ఘటనపై త్వరితగతిన స్పందించిన టీమ్‌లన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com