నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- November 09, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో సమయాలను నవంబర్ 10 వరకు పొడించారు. తెల్లవారుజామున 3.00 నుండి ఉదయం 12 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ రైడ్‌లో పాల్గొనే వ్యక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు తెలిపారు. దుబాయ్ రైడ్ లో భాగంగా అతిపెద్ద కమ్యూనిటీ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ఓపెన్ గా ఉంటాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. బైక్-షేరింగ్ కంపెనీ కరీమ్ ఈవెంట్‌లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా బైకులను అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు







