పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం

- November 09, 2024 , by Maagulf
పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం

పాకిస్తాన్: పాకిస్థాన్ లో నేటి ఉదయం ఒక రైల్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 20మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 60మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో బోగీలతో పాటు ప్లాట్ ఫాం పై కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులున్నారు. పేలుడు తీవ్రతతో భారీగా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com