వలసలు - అభివృద్ధి కార్యక్రమానికి ముగ్గురు తెలుగు గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకుల ఎంపిక
- July 07, 2015
కార్మిక నాయకులకు సామర్థ్య పెంపుదల కార్యక్రమంలో భాగంగా "వలసలు మరియు అభివృద్ధి: సమస్యలు, ధృక్కోణాలు" అనే అంశంపై డిల్లీ సమీపంలోని నోయిడాలోని వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్ స్టిట్యూట్ లో ఈనెల 13 నుండి 16 వరకు నాలుగు రోజులపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకులు శ్రీ కడార్ల రంజిత్ కుమార్, కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాసి భారతీయ వ్యవహారాల న్యాయ నిపుణులు శ్రీ నాగుల రమేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మానిక్యాలరావ్ లకు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానం వచ్చింది.
దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలు, పరిశోదనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన నిపుణులు వీరికి శిక్షణ ఇస్తారు. ఉపన్యాసాలు, సంప్రదింపులు, చర్చలు, అధ్యయనాల ఉదాహరణల విధానంలో భోధన ఉంటుంది. వలస మరియు అభివృద్ధి మధ్య సంబంధాల అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వలసల పరిశోధన, విధానపరమైన అంశాలలో ఉద్భవించే సమస్యలను అధిగమించడానికి పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలు సామర్థ్యాలను అభివృద్ధి చేస్తారు. వలసలకు సంబంధించిన భావాలు మరియు సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం, ప్రపంచీకరణ ఆర్ధికవ్యవస్థలో వలసలపై పోకడలు మరియు నమూనాలు పరిశీలించడం, సమకాలీన వలస విధానాలను చర్చించడం, వలసలకు అభివృద్ధికి గల సంభావ్యతను విశ్లేషించడం జరుగుతుంది.
మంద భీంరెడ్డి('మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్)
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









