ఏపీలో మరో ఉపఎన్నిక-ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
- November 11, 2024
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠాన్మరణం కారణంగా ఈ స్ధానం ఖాళీగా ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగే ఉపఎన్నిక కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
అనంతరం ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 5న గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం విడుదల చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







