చంద్రుడి పై జెండా పాతనున్న బహ్రెయిన్..!
- November 15, 2024
యూఏఈ: యూఏఈ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ భాగస్వామ్యంతో చారిత్రాత్మక చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ సిద్ధమవుతుంది. నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (NSSA) తన మొదటి పేలోడ్ను చంద్రునిపైకి పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ మైలురాయి మిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) సహకారంతో ఎమిరేట్స్ లూనార్ మిషన్లో భాగంగా ఉంది. ఇది అంతరిక్ష అన్వేషణ, సాంకేతిక పురోగతి కోసం అరబ్ ఇంట్రస్ట్ ను తెలియజేయనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024లో ఈ మేరకు ప్రకటించారు.
బహ్రెయిన్ NSSA చే అభివృద్ధి చేయబడిన హై-టెక్ నావిగేషన్ కెమెరాలను చంద్రుని వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఈ కెమెరాలు రోవర్ నావిగేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి, మట్టి నమూనాలను విశ్లేషించడానికి, రోవర్ కదలికను పర్యవేక్షించడానికి తోడ్పాటు అందిస్తాయని NSSA సీఈఓ డా. మొహమ్మద్ ఇబ్రహీం అల్-అసీరి తెలిపారు. "ఈ మిషన్ బహ్రెయిన్ వర్క్ఫోర్స్లోని ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సహకారం అందించడానికి మా ఇంజనీర్ల సంసిద్ధతను ప్రదర్శిస్తుంది" అని డాక్టర్ అల్-అసీరి వ్యాఖ్యానించారు. బహ్రెయిన్ చంద్రునిపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నందున, NSSA-MBRSC సహకారం రెండు దేశాలకు ఒక మైలురాయిని మాత్రమే కాకుండా ప్రపంచ చంద్రుడి పరిశోధనకు సహకారాన్ని అందిస్తుందని MBRSC డైరెక్టర్ జనరల్ సేలం హుమైద్ అల్మర్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







