ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్‌.. మెట్రో వేళలు పొడిగింపు..!!

- November 16, 2024 , by Maagulf
ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్‌.. మెట్రో వేళలు పొడిగింపు..!!

యూఏఈ: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) మెట్రో ఆపరేటింగ్ వేళలను పొడిగించింది. నవంబర్ 16 ఉదయం 5 గంటల నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త సమయాలు నవంబర్ 17 ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటాయి. ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్‌కు హాజరయ్యే వారి కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. దుబాయ్‌లోని జబీల్ పార్క్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌తో యూఏఈలోని భారతీయ కమ్యూనిటీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ 'దీపావళి'ని జరుపుకోనున్నారు. ఈవెంట్స్ సందర్భంగా భారతీయ సంస్కృతిక ప్రదర్శనలతోపాటు బాద్‌షా, జోనితా గాంధీ, ఇండీ రాక్ బ్యాండ్ అవియల్‌తో కాన్సర్టులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.  సందర్శకుల కోసం జబీల్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పాట్‌లు అందుబాటులో ఉంటాయని RTA ప్రకటించింది. దీనితోపాటు అల్ వాస్ల్ ఫుట్‌బాల్ క్లబ్‌లోని పార్కింగ్ స్థలం, బూమ్ విలేజ్ నుండి ఈవెంట్ ప్రదేశానికి ఉచిత షటిల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com