మ్యాచ్ ఫిక్సింగ్..దుబాయ్ లో బ్రెజిల్ జాతీయుడు అరెస్ట్..!!
- November 17, 2024
దుబాయ్: తన దేశంలో మోసానికి పాల్పడినందుకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జాబితాలో ఉన్న బ్రెజిల్ జాతీయుడు విలియం పెరీరా రొగాట్టోను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అథారిటీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. రొగాట్టో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఫలితాలను తారుమారు చేసి, అంతర్జాతీయ స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్లలో చేసిన బెట్టింగ్‌ల ద్వారా అక్రమ లాభాలను గడించారని కేసులు ఎదుర్కొంటున్నారు. 34 ఏళ్ల రొగాట్టో యూరప్ పర్యటనలో దేశానికి వచ్చిన తర్వాత అరెస్టు చేసినట్లు నేర పరిశోధనల జనరల్ డిపార్ట్మెంట్లోని వాంటెడ్ పర్సన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తారిఖ్ హిలాల్ అల్ సువైదీ తెలిపారు. అన్ని రకాల అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి దుబాయ్ పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







