రాజధాని అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన ..
- June 24, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోశనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత అనుసంధాన రహదారికి వెంకటపాలెం వద్ద సీఎం శంకస్థాపన చేశారు. రూ.215 కోట్లతో 18.3 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలేనికి కొత్త రహదారినిర్మించి, 6 వరుసల రహదారిని కొత్తగా నిర్మించే రహదారికి అనుసంధానం చేస్తారు. ఇందులో భాగంగా కనకదుర్గ వారధి మార్గం నుంచి పీడబ్ల్యూ వర్క్‌షాప్ వరకు పైవంతెన నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, రావెల కిశోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు టి.శ్రావణ్‌కుమార్, జి.వి.ఆంజనేయులు, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









