ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్ ..
- June 25, 2016
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది.తొలి టీజర్ లో పాత్రల పరిచయంతో పాటు సినిమాలో ఆ పాత్రలు ప్రవర్తించే తీరును కూడా చూపించాడు దర్శకుడు. ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్ లోనే ఈ సినిమాలో నాలుగు కీలక పాత్రలు ఉంటాయన్న హింట్ ఇచ్చిన దర్శకుడు ఆ పాత్రలను తొలి టీజర్ లోనే పరిచయం చేసేశాడు.మహిత్, స్కూలుకు వెళ్లే 12 ఏళ్ల అమ్మాయి. అభిరామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. గాయత్రి హౌస్ వైఫ్, సాయిరాం సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్. ఇలా సినిమాలో నాలుగు కీలక పాత్రలను టీజర్ లో పరిచయం చేశాడు దర్శకుడు. చాలాకాలం తరువాత గౌతమి టాలీవుడ్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు తన తొలి సినిమాలోనే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసి, రిలీజ్ కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, క్వాలిటీ పరంగా కూడా అదే స్థాయిని చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









