టాక్సీలలో స్మోకింగ్ కు ఏఐతో చెక్.. ఉల్లంఘనలను గుర్తించేందుకు ట్రాక్..!!
- November 19, 2024
దుబాయ్: టాక్సీల లోపల స్మోకింగ్ ను గుర్తించేందుకు దుబాయ్ కృత్రిమ మేధస్సు (AI)ని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తోంది. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) కారులో కెమెరాల ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ లో పబ్లిక్ రవాణా మార్గాలలో స్మోకింగ్ ను నిషేధించారు. ఎమిరేట్ అంతటా టాక్సీ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో అధికార యంత్రాంగం అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. 500 కంటే ఎక్కువ విమానాశ్రయ టాక్సీలలో "అధిక-నాణ్యత ఎయిర్ ఫ్రెషనర్లను" ఉపయోగించడానికి పైలట్ దశను ప్రారంభించినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, RTAలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు."డ్రైవర్లతో పాటు కంపెనీలు, డ్రైవింగ్ స్కూల్లలో బోధకులకు అవగాహన శిక్షణా కార్యక్రమాలను తీవ్రతరం చేయడం ఈ కార్యక్రమాలలో ఉన్నాయి.” అని పేర్కొన్నారు. ట్యాక్సీ పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త కార్యక్రమాల ప్రభావాన్ని అథారిటీ ట్రయల్ రన్ లో అంచనా వేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







