సౌదీలో కొత్త వాణిజ్య చట్టం..8.8% పెట్టుబడులు పెరుగుతాయని అంచనా..!!

- November 19, 2024 , by Maagulf
సౌదీలో కొత్త వాణిజ్య చట్టం..8.8% పెట్టుబడులు పెరుగుతాయని అంచనా..!!

రియాద్: సౌదీ చాంబర్స్ ఫెడరేషన్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా కొత్త వాణిజ్య నమోదు చట్టం స్థానిక పెట్టుబడులలో 8.8 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. GDPకి SR1.7 ట్రిలియన్ల సహకారాన్ని, మొత్తం 1.5 మిలియన్ యాక్టివ్ వాణిజ్యాన్ని నమోదు చేస్తుందని వెల్లడించారు. కంపనీల కోసం సబ్-రిజిస్ట్రీలను తీసివేయడం, వ్యాపారాలు దేశవ్యాప్తంగా ఒకే రికార్డుతో పనిచేయడానికి అనుమతించడం వంటి కీలక మార్పులు కొత్త చట్టంలో ఉన్నాయి. వ్యాపారాలు రాజ్యమంతటా స్వేచ్ఛగా విస్తరించడానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు తెలిపారు. సబ్-రిజిస్ట్రీలను తొలగించడం ద్వారా వ్యాపారాలు ఏటా SR80 మిలియన్ల నుండి SR110 మిలియన్ల వరకు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. కొత్త చట్టం పెట్టుబడి వృద్ధికి ఊతమిస్తుందని, స్థానిక పెట్టుబడులు 7.4 శాతం, 8.8 శాతం మధ్య పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంకా, ఆర్థిక స్థాపనల శాఖల సంఖ్య 3.8 శాతం నుండి 5.3 శాతానికి పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ సౌదీ ఛాంబర్స్ భావిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com