బిగ్ బ్యాడ్ వోల్ఫ్ సేల్.. Dh1.99 నుండి ప్రారంభం..!!

- November 20, 2024 , by Maagulf
బిగ్ బ్యాడ్ వోల్ఫ్ సేల్.. Dh1.99 నుండి ప్రారంభం..!!

యూఏఈ: ‘వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్ సేల్' అని పిలవబడే బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ సేల్ ఆరవ సీజన్ తిరిగి వచ్చింది. దుబాయ్‌లో నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఆరో సీజన్ సేల్ దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్‌లలో జరగనుంది. ప్రారంభ రోజున Dh1.99కి పుస్తకాల విక్రయాలు ప్రారంభమవుతాయని, వివిధ శీర్షికలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. బిగ్ బాడ్ వోల్ఫ్, అరబ్ & అంతర్జాతీయ ప్రచురణకర్తలకు ప్రముఖ వేదిక అయిన షార్జా బుక్ అథారిటీ.. కలిమత్, మెనాస్సా వంటి ముఖ్య భాగస్వాముల సహకారంతో రూపొందించబడిన అరబిక్ సాహిత్యం ముఖ్యమైన ఎంపికలను సందర్శకుల కోసం అందుబాటులో పెట్టారు. అరబిక్‌లో 50,000 కంటే ఎక్కువ శీర్షికలను చేర్చడం ప్రతిచోటా పాఠకులకు అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాలనే మా మిషన్‌కు నిదర్శనం అని బిగ్ బ్యాడ్ వోల్ఫ్ షార్జా బోర్డు సభ్యుడు మొహమ్మద్ నూర్ హెర్సీ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com