ఇండియన్ టూరిస్ట్ మృతి: ఆందోళనలో కుటుంబం
- June 25, 2016
ఓ భారతీయ టూరిస్ట్ దుబాయ్‌లో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ట్రావెల్ వీసా కూడా లేకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స కోసం 197,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంది. దంటో 35,000 దిర్హామ్‌లు వారు చెల్లించగలిగారు. ఆసుపత్రి ఇచ్చిన డిస్కౌంట్ తర్వాత ఇంకా 126,00 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి సహాయం కోరుతున్నారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, అతనికి చికిత్స అందించిన వైద్యులు అక్యూట్ నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కుడివైపు లంగ్ పూర్తిగా పనిచేయకపోవడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు, ఈ పరిస్థితి నుంచి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నపాటి ఆదాయంతో బతుకులీడ్చుతున్న తమకు రాకూడని కష్టం వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









