ఇండియన్‌ టూరిస్ట్‌ మృతి: ఆందోళనలో కుటుంబం

- June 25, 2016 , by Maagulf
ఇండియన్‌ టూరిస్ట్‌ మృతి: ఆందోళనలో కుటుంబం

ఓ భారతీయ టూరిస్ట్‌ దుబాయ్‌లో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ట్రావెల్‌ వీసా కూడా లేకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స కోసం 197,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంది. దంటో 35,000 దిర్హామ్‌లు వారు చెల్లించగలిగారు. ఆసుపత్రి ఇచ్చిన డిస్కౌంట్‌ తర్వాత ఇంకా 126,00 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి సహాయం కోరుతున్నారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, అతనికి చికిత్స అందించిన వైద్యులు అక్యూట్‌ నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కుడివైపు లంగ్‌ పూర్తిగా పనిచేయకపోవడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు, ఈ పరిస్థితి నుంచి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నపాటి ఆదాయంతో బతుకులీడ్చుతున్న తమకు రాకూడని కష్టం వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com