90 ఏళ్ల చారిత్రాత్మక బంధం.. బహ్రెయిన్‌కు తిరిగొచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్..!!

- November 21, 2024 , by Maagulf
90 ఏళ్ల చారిత్రాత్మక బంధం.. బహ్రెయిన్‌కు తిరిగొచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్..!!

మనామా: బ్రిటిష్ ఎయిర్‌వేస్ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ బహ్రెయిన్‌కు కార్యకలాపాలను పునఃప్రారంభించింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ బహ్రెయిన్‌కు తన కార్యకలాపాలను పునఃప్రారంభించింది.  ఇది 90 సంవత్సరాలకు పైగా ఉన్న భాగస్వామ్యాన్ని చాటిచెప్పింది.  ఎయిర్‌లైన్ తిరిగి రావడం కీలకమైన లండన్-బహ్రెయిన్ మార్గాన్ని బలోపేతం చేస్తుందని, ఇది కనెక్టివిటీకి కీలకమని, ఇది దశాబ్దాలుగా యునైటెడ్ కింగ్‌డమ్ - బహ్రెయిన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక మార్పిడిని సులభతరం చేసిందని అధికారులు కొనియాడారు. విమానాల పునఃప్రారంభం రెండు దేశాల మధ్య చిరకాల బంధంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. 1976లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ కాంకోర్డ్ తొలి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఈ చారిత్రాత్మక మార్గం.. వ్యాపారాలు, పర్యాటకులు, విద్యార్థులు,  కుటుంబాలకు అవకాశాలను పెంపొందించింది.  బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) ఆపరేటర్ అయిన బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (BAC) ఎయిర్‌లైన్ తిరిగి రావడాన్ని ఉత్సాహంతో స్వాగతించింది. బహ్రెయిన్ ఆర్థిక వృద్ధిని, వాణిజ్య అవకాశాలను అన్‌లాక్ చేస్తుందని, ఇరువైపులా ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించడంలో  బ్రిటిష్ ఎయిర్‌వేస్ పాత్రను బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం హైలైట్ చేసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాల పునఃప్రారంభం దీర్ఘకాల సహకారానికి కొనసాగింపుగా మాత్రమే కాకుండా బహ్రెయిన్ -యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య చారిత్రాత్మక బంధాన్ని బలోపేతం చేయడంలో సరికొత్త అధ్యాయాన్ని కూడా సూచిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com