ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు..
- November 21, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) తో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఎన్టీపీసీ పెట్టే పెట్టుబడులతో 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పాయి.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







