ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే ఈ లాభాలు ఉన్నాయి

- November 22, 2024 , by Maagulf
ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే ఈ లాభాలు ఉన్నాయి

కొబ్బరిని కొన్ని వంటల్లోనే వాడతారు. కానీ, దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ప్రతిరోజూ తీసుకుంటారు. ముఖ్యంగా దీనిని ఉదయాన్నే తీసుకుంటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్‌లు ఉన్నాయి. దీనిని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. వంటల్లో అప్పుడప్పుడు మాత్రమే వాడే కొబ్బరిని రెగ్యులర్‌గా తింటే శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు తగ్గడం నుంచి మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికోసం కొబ్బరిని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోండి.

 ఉదయాన్నే కొబ్బరిని తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యల్ని దూరం చేయడంలో కొబ్బరి హెల్ప్ చేస్తుంది. కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా‌కి సపోర్ట్ చేస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం దూరమవుతుంది.

కొబ్బరిని మనం స్నాక్‌లా తీసుకుంటే చాలా మంచిది. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. అందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సిక్‌నెస్ తగ్గుతుంది. కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధులని దూరం చేసుకోవచ్చు.

కొబ్బరిలో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి. దీని వల్ల ఎక్కువగా తినరు. మొండి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. రెగ్యులర్‌గా తింటే బరువు కూడా తగ్గుతారు. వేడిని ఉత్పత్తి చేసి కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్‌తో దీనిని స్పీడ్ అప్ చేయొచ్చు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రోజు మొత్తానికీ సరిపడా ఎనర్జీని అందిస్తాయి. దీంతో పాటు మానసికంగా ఆనందంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. దీంతో షార్ప్‌గా ఉంటారు. దీనికోసం కొబ్బరిని రెగ్యులర్‌గా తినాలి. ఇది పిల్లలకి చాలా మంచిది. వారికి రెగ్యులర్‌గా కొబ్బరిని ఇస్తే చదువుల్లో ముందుంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం, కొబ్బరి తినడం వల్ల బ్రెయిన్ హెల్తీగా మారుతుంది. అయితే, మోతాదులోనే ఇవ్వాలి.

కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ స్కిన్‌ని మాయిశ్చరైజ్,కోమలంగా చేస్తుంది. దీనికోసం ఉదయాన్నే తినాలి. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ జుట్టుని పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. దీంతో జుట్టు షైనీగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి సన్నబడడాన్ని తగ్గిస్తుంది.

ఇలా తినాలి:
       
1. తాజా, ఆర్గానిక్ కొబ్బరిని తీసుకోండి.

2. దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉదయాన్నే 2 టేబుల్ స్పూన్ పరిమాణంలో తీసుకోండి. ఎక్కువగా తీసుకోవద్దు. 

3. కొబ్బరిని మనం తురిమి, కట్ చేసి ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ కొబ్బరిని సలాడ్‌, మీకు ఇష్టమైన ఫుడ్స్‌లో వేసి తినొచ్చు. 

4. తాజా కొబ్బరిని ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో వేసి స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com