దోహా వేదికగా వైభవంగా ప్రారంభమైన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

- November 22, 2024 , by Maagulf
దోహా వేదికగా వైభవంగా ప్రారంభమైన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

దోహా: దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు , సాహితీ వేత్తలు , కవులు , రచయితలు , వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా, భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లేలా దోహా వేదికగా 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. ఖతార్ దేశం లో భారత రాయబారి విపుల్ కు పలు హిందీ, తెలుగు గ్రంధాలను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ బహూకరించారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు అనారోగ్యం వలన వీడియో సందేశం పంపారు. దర్శక నిర్మాత వై వి యస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు భాగవతుల వెంకప్ప తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయనున్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రత్నిది, ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com