ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమా తీయనున్న డైరెక్టర్ రవిబాబు
- June 25, 2016
అల్లరి, అవును, అనసూయ, లడ్డూ బాబు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తే క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.పూర్తిగా పంది పిల్ల చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాతో అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







