మ్యాన్‌హోల్ కవర్లపై ఫిర్యాదు చేసేందుకు ఓ మోబైల్ యాప్..
- June 25, 2016
ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోల్ కవర్లపై ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే ఓ మోబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని వాటర్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ తెలిపారు. అంతేకాకుండా, వర్షాలవల్ల ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే విధంగా బోర్డు కార్యాలయంలో ఓ ప్రత్యేక పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటుచేయనున్నట్లు, ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వచ్చే సోమవారం కల్లా ఫోన్ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎంసీసీ(మెట్రో కస్టమర్ కేర్)కు ఇది అదనమని ఆయన స్పష్టంచేశారు. వర్షాకాల కార్యప్రణాళికపై ఆయన స్పందిస్తూ.. పాడైన మ్యాన్‌హోల్ కవర్లను మార్చేందుకు వచ్చే 10రోజుల్లో 10వేల మ్యాన్‌హోల్ కవర్లను కొనుగోలు చేయనున్నట్లు, అంతేకాకుండా అన్ని మ్యాన్హోళ్లకూ సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మరమ్మతులకోసం రూ. 50లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఎక్కడైనా నీరు కలుషితమైనట్లు గుర్తిస్తే యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉద్దేశించిన డయల్ యువర్ సీజీఎం కార్యక్రమాన్ని వచ్చే నెలనుంచి ప్రతి పదిహేను రోజులకోసారి సర్కిళ్లవారీగా ఏర్పాటుచేస్తున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే ఫోన్ నెంబర్‌ను తెలియజేస్తామన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, పాడైన మ్యాన్‌హోల్ కవర్లను గుర్తించి వచ్చే మంగళవారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదేరోజు మేనేజర్లతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. చిన్నచిన్న గల్లీల్లో సైతం సీవరేజీ పైపులను శుభ్రం చేసేందుకు అదరంగా చిన్నతరహా ఎయిర్‌టెక్ మిషన్లను సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. ఈ మిషన్ల పనితీరును అధ్యయనం చేసేందుకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం త్వరలో చెన్నయ్, ఢిల్లీల్లో పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







