కన్నడ నటి సరోజమ్మ మృతి..

- June 25, 2016 , by Maagulf
కన్నడ నటి సరోజమ్మ మృతి..

ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రద్వారా ప్రముఖ నటిగా పేరొందిన సరోజమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కమలానగర్‌లో నివసిస్తున్న ఆమె అస్వస్థతకు గురికాగా ఓ ప్రై వేటు ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స ఫలించక సరోజమ్మ మృతి చెందారు. ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నటుడు దర్శన హీరోగా నటించిన 'కిట్టీ' చిత్రంలో విలన్ పాత్రలోనూ పేరొందారు. పలు కన్నడ సినిమాలలో ఆమె నటించారు. మారిముత్తు సరోజమ్మ మృతి పట్ల శాండల్‌వుడ్‌ తారలు, దర్శక నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. కమలానగర్‌లోని ఆమె నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com